Hospital | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ఆసుపత్రి (Hospital)లో దయనీయ స్థితి నెలకొంది. అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (Intensive Care Unit)లో గత కొన్ని నెలలుగా ఏసీలు పనిచేయడం లేదు. దీంతో ఉక్కపోతకు రోగులు అల్లాడిపోతున్నారు.
జబల్పూర్లోని సేత్ గోవింద్ దాస్ విక్టోరియా జిల్లా ఆసుపత్రిలో (Seth Govind Das Victoria District Hospital) ఈ దుస్థితి నెలకొంది. రోగులు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నసమయంలో చికిత్స అందించే ఈ యూనిట్లో ఈ పరిస్థితి నెలకొనడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉక్కపోతకు అల్లాడుతున్న రోగులు తమ ఇళ్ల నుంచి టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకొని మంచాల చెంతన (patients bring their own fans) ఏర్పాటు చేసుకుంటున్నారు. స్థానిక మీడియా ప్రతినిధులు ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. బడ్జెట్ లేకపోవడమే ఇందుకు కారణమని వారు పేర్కొనడం గమనార్హం.
నార్త్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభిలాష్ పాండే ఇటీవలే విక్టోరియా ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలోని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దోషులుగా తేలిన వారిని శిక్షిస్తామని రోగులకు హామీ ఇచ్చారు. మాండ్లా, దిండోరితో సహా ఇతర జిల్లాల్లోని ఆసుపత్రుల్లోనూ ఇలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయని ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ మనీష్ మిశ్రా తెలిపారు.
Also Read..
Actor Siddique | అత్యాచారం కేసులో సిద్ధిఖీకి ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
Supreme Court | చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన సుప్రీం కోర్టు
Tirupati Laddoo: కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరం పెట్టండి: సుప్రీంకోర్టు