Supreme Court | చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన సుప్రీం కోర్టు
Supreme Court | తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
ఢిల్లీ : తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu) చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు (Supreme Court) తప్పుపట్టింది. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా అంటూ నిలదీసింది . కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంపై రెండో ఒపీనియన్ తీసుకోకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యవహారంలో మీడియాకు వెళ్లాల్సిన అవసరం లేదని అభిప్రాయ పడింది.
అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం, మరో ఇద్దరు న్యాయవాదులు చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్నారని, కల్తీ వ్యవహారంపై నిజనిజాలు తేల్చాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ విచారణ చేపట్టారు. ఏపీ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా(Siddartha Luthra) వాదనలు వినిపించారు. లడ్డూలో కల్తీ జరిగిందని అనుమానం ఉన్నప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ఏపీ న్యాయవాదిని ప్రశ్నించింది.
నెయ్యి కల్తీ జరిగినట్టు గుర్తించిన తర్వాత , తయారైన లడ్డూలను టెస్టింగుకు పంపారా, లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇరువాదనలు విన్న కోర్టు కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సూచించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

