Maha Kumbh Mela | జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళా (Maha Kumbh Mela)కు ఉత్తరప్రదేశ్‌లోని గంగ, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్‌రాజ్ (Prayagraj) ముస్తాబవుతోంది. మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఈ కుంభమేళాకు బాంబు బెదిరింపులు రావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఓ ఎక్స్ యూజర్ ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. మతపరమైన ఈ కార్యక్రమానికి హాజరయ్యే కనీసం 1,000 మందిని లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు (Threat Of Blast ) పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన యూపీ పోలీసులు (UP Police) సదరు ఎక్స్ యూజర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు.
కాగా, మహా కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్ సిద్ధమవుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కుంభమేళాలో 45 కోట్లమంది భక్తులు పాల్గొని గంగాస్నానం ఆచరిచేం అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో పాల్గొనే భక్తుల సౌకర్యం కోసం 1,60,000 టెంట్లు, 1,50,000 మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తారు. 1,250 కిలోమీటర్ల పైప్‌లైనును సిద్ధం చేస్తున్నారు. 67 వేల ఎల్ఈడీ లైట్లు, 2 వేల సోలార్ లైట్లు, 3 లక్షల మొక్కలు ఏర్పాటవుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కెమెరాలు, ఆర్ఎఫ్ఐడీ రిస్ట్‌బ్యాండ్స్, యాప్ ట్రాకింగ్‌లతో భక్తులను లెక్కిస్తారు.
Also Read..
Sanjay Raut | 2026 తర్వాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొనసాగడం కష్టమే : సంజయ్ రౌత్
Chinmoy Krishna Das: చిన్మయ్ కృష్ణ దాస్‌కు బెయిల్ నిరాకరించిన బంగ్లాదేశ్ కోర్టు