ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై, అధికార బీజేపీ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శల దాడి పెంచారు. రాష్ట్ర ప్రజలకు యోగ్యమైన సర్కార్ అవసరం కానీ యోగి సర్కార్ కాదని ఎద్దేవా చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కనీసం లాప్టాప్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదని వ్యాఖ్యానించారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో యోగి ఆదిత్యనాథ్‌కు తెలియదన్నారు.
భారతీయ జనతా పార్టీ చేస్తున్నది అభివృద్ధి రాజకీయాలు కాదని విధ్వంసక రాజకీయం అని అఖిలేశ్ యాదవ్ మండి పడ్డారు. బీజేపీ ప్రజలను మోసగిస్తుంది. ఆజంగఢ్‌ను అప్రతిష్ఠ పాల్జేసే వారెవరైనా ఉన్నారా అంటే అది బీజేపీ. వారు (బీజేపీ) ఓ వ్యాపారిని హత్య చేస్తుంది. జిల్లాకు చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఆయన (సీఎం)కు వ్యతిరేకంగా కేసులు ఉన్నాయి. కానీ వాటిని ఉపసంహరించుకుంటారు అని అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మధ్య మాటల యుద్ధం సాగుతున్నది.
A 'Yogya Sarkar' is the need in UP, not 'Yogi Sarkar'. The one that knows to operate laptop, internet… The CM can't even operate a laptop. I have also heard that he doesn't know how to operate a phone either: Samajwadi Party leader Akhilesh Yadav pic.twitter.com/FKprKkStPo
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 13, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
Mukesh Ambani | స్పోర్ట్స్.. ఆతిథ్యంపై ముకేశ్ అంబానీ క్రేజీ.. అందుకే లండన్ ఎస్టేట్ సొంతం?!