Viral Video | బైక్‌ను ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు యువకులు.. షాకింగ్ వీడియో
Viral Video | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ట్రక్కు (Speeding Truck) ముందు వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టింది.
Viral Video | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ట్రక్కు (Speeding Truck) ముందు వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. అనంతరం 100 మీటర్ల వరకూ అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఆగ్రాలోని వాటర్ వర్క్స్ రోడ్డులో ఆదివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తుండగా.. వెనుకనుంచి అతివేగంగా వస్తున్న ఓ ట్రక్కు వెనుక నుంచి బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ క్రమంలో ట్రక్కు ముందు భాగంలో బైక్‌తోపాటు ఆ ఇద్దరు యువకులు చిక్కుకుపోయారు. ఓ యువకుడి తల ట్రక్ ముందు టైరుకు అడుగు దూరంలో ఉంది. ఆ ఇద్దరు యువకులు ప్రాణ భయంతో కాపాడండి అంటూ కేకలు వేస్తున్నా ట్రక్కు డ్రైవర్ అవేవీ పట్టించుకోకుండా వేగంగా వెళ్లసాగాడు.
అటుగా వెళ్తున్న వాహనదారులు ఈ తతంగాన్నంతా గమనించి ట్రక్కును ఓవర్‌టెక్ చేసి ఆపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఆ ఇద్దరు యువకులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. పోలీసులు వచ్చే సరికి ఆ ట్రక్కు డ్రైవర్‌కు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
#Horrible ⚠️Sensitive media #Agra, UP : Two men riding on a bike were first hit by a truck and were dragged to about 100 meters on Sunday night at 11.30 pm, on water works road in Agra, UP.
Others drivers passing by overtook the truck and stopped it. Auto drivers admitted both… pic.twitter.com/DffufKnAmU
— Saba Khan (@ItsKhan_Saba) December 23, 2024
Also Read..
Himachal Pradesh | హిమాచల్‌పై మంచు దుప్పటి.. జాతీయ రహదారులు సహా 170 రోడ్లు మూసివేత..!
Heavy Snow | మనాలీలో భారీగా హిమపాతం.. చిక్కుకుపోయిన 1,000కి పైగా వాహనాలు.. VIDEOS
Allu Arjun | చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన అల్లు అర్జున్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

