Allu Arjun | సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun)కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు పంపారు. దీంతో అల్లు అర్జున్ తన ఇంటినుంచి విచారణకు హాజరుకావడానికి చిక్కడపల్లి బయలుదేరారు. అల్లు అర్జున్తో పాటు అతడి మామ చంద్రశేఖర్, ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ బన్నీ వెంట వెళుతున్నారు. దాదాపు రెండు గంటల పాటు ఈ విచారణ జరగబోతుండగా.. ఏసీపీ రమేష్ కుమార్తో పాటు సెంట్రల్ జోన్ డిఎస్పీలు అల్లు అర్జున్ను విచారించనున్నారు.