ఘజియాబాద్, ఆగస్టు 7: యూపీలో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో పాల ట్యాంకర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడి మరణించినా.. అతని పరిస్థితి పట్టించుకోకుండా చుట్టుపక్కల వారు ఆ ట్యాంకర్‌లోని పాలకోసం ఎగబడ్డ అమానవీయ ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో జరిగింది. మంగళవారం ఘజియాబాద్-మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై ఒక పాల ట్యాంకర్, వ్యాన్ ఢీకొన్నాయి.
ట్యాంకర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదంతో ట్యాంకర్ నుంచి పాలు కారడం ప్రారంభించాయి. దీంతో అక్కడ ఉన్న జనం డ్రైవర్ చనిపోయాడో, బతికున్నాడో కూడా పట్టించుకోకుండా చేతికి అందిన బాటిల్స్, క్యాన్లు, బకెట్లతో ఆ పా లను పట్టుకోవడానికి ఎగబడ్డారు.