లక్నో: కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. (Pankaj Chaudhary) కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ సమక్షంలో ఈ మేరకు ఆదివారం వెల్లడించారు. పంకజ్ చౌదరికి ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని పియూష్ గోయల్ అందజేశారు.
కాగా, కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి శనివారం ఈ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. పోటీలో ఉన్న ఏకైక అభ్యర్థి ఆయనే కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి తన వారసుడికి పార్టీ జెండాను అందజేశారు.
మరోవైపు బీజేపీ కొత్తగా ఎన్నుకున్న 120 మంది జాతీయ కౌన్సిల్ సభ్యుల పేర్లను కూడా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. వీరిలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. వారణాసికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండగా, సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి, కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్‌రాజ్ నుంచి, బ్రజేష్ పాఠక్ ఉన్నావ్ నుంచి బీజేపీ జాతీయ కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Also Read:
Nitin Nabin | బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా.. బీహార్ మంత్రి నితిన్ నబిన్
Vijay Shah | మరోసారి నోరు జారిన మంత్రి.. లబ్ధిపొందే మహిళలు సీఎం సభలకు రావాలని డిమాండ్
woman marries Krishna idol | కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన మహిళ.. ఎందుకంటే?