Delhi | ముంబై, ఏప్రిల్ 15: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నగరంలో కేవలం 3 రోజులున్నా.. ఆ వ్యక్తికి రోగాలు (ఇన్ఫెక్షన్లు) సోకటం ఖాయమని అన్నారు. సోమవారం ముంబైలో ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఢిల్లీ వాయు కాలు ష్యం బారిన పడ్డవాళ్ల ఆయుష్షు 10 ఏండ్లు తగ్గుతుందని అన్నారు. వాయు కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబై నగరాలు రెడ్ జోన్లో ఉన్నాయని చెప్పారు.
నగరాల్లో పర్యావరణ సమస్యల్ని అత్యవసరంగా పరిష్కరించాల్సి ఉందన్నారు. ‘పర్యావరణ సమస్యల్ని మనం అంత సీరియస్‌గా తీసుకోవటం లేదు. ఆర్థికం, మౌలిక వసతుల కల్పనకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో, ఎకాలజీ (జీవావరణం), ఎథిక్స్‌కు (న్యాయమైన వ్యాపారం) కూడా అంతే ప్రాధాన్య ం ఇవ్వడం ముఖ్యం’ అని చెప్పారు. సుమారుగా రూ.22 లక్షల కోట్ల విలువజేసే శిలాజ ఇంధనాల్ని భారత్ దిగుమతి చేసుకుంటున్నదని, వాయు కాలుష్యానికి ప్రధాన కారకాలైన పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని సూచించారు.