న్యూఢిల్లీ: రానున్న ఐదేండ్లలో పెట్రోల్, డీజిల్పై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గిస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘దేశంలో ఎలక్ట్రిక్, బయోడీజిల్, హైడ్రోజన్, ఇథనాల్, సీఎన్జీ, ఎల్ఎన్జీ వాడకం పెరుగుతున్నది. చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల కోసం క్యూ కడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే పెట్రోల్, డీజిల్ వాడకం క్రమంగా తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో రానున్న ఐదేండ్లలో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.