న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల కుటుంబాలకు ఒక రోజు గ్యాస్ ఖర్చు కేవలం రూ.5లే అవుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. మిగతా గ్యాస్ వినియోగదారుల కుటుంబాలకు సుమారుగా రూ.12 ఖర్చవుతుందని చెప్పుకొచ్చారు. డాలర్ మారకపు రేటు ఆధారంగా ఈ లెక్కింపు చేసినట్టు చెప్పారు.
ఈ మేరకు ఆయన ఎక్స్‌లో మంగళవారం పోస్ట్ చేశారు. ఉజ్వల పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. ఈ పథకం కారంణంగా 2014లో 14 కోట్లుగా ఉన్న ఎల్పీజీ కనెక్షన్లు 2024 నాటికి 33 కోట్లకు పెరిగాయన్నారు.