Fuel Prices | పెట్రోల్, డీజిల్ ధరలు దిగివస్తాయా.. ! : ఇంధన ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను (Fuel Prices) తగ్గిస్తుందని గత కొద్దికాలంగా ప్రచారం సాగుతోంది.
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను (Fuel Prices) తగ్గిస్తుందని గత కొద్దికాలంగా ప్రచారం సాగుతోంది. భగ్గుమంటున్న పెట్రో మంటల నుంచి సామాన్యులకు కాస్త ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ. 10 వరకూ తగ్గిస్తారనే అంచనాలూ ఊపందుకున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటేందుకు ధరల భారం నుంచి ప్రజలకు ఊరట ఇచ్చేలా కేంద్రం పెట్రో ధరలను తగ్గిస్తుందనే వార్తల నడుమ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ పూరి స్పందించారు. ఇంధన ధరలపై బుధవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చమురు ధరల్లో తీవ్ర అనిశ్చితి నెలకొనడంతో రాబోయే రోజుల్లో ఇంధన ధరలను తగ్గించే అవకాశం లేదని మంత్రి తేల్చిచెప్పారు. పెట్రో ధరలు తగ్గుతాయనే వార్తలను ఊహాజనితమైనవని ఆయన తోసిపుచ్చారు.
ఇంధన ధరలను తగ్గించే ఎలాంటి ప్రతిపాదన లేదని మంత్రి పేర్కొన్నారు. ఇంధనాన్ని అందుబాటులో ఉంచేందుకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి చమురు వినియోగమే కీలకమని వ్యాఖ్యానించారు. ముడిచమురు ధరలు ఎగబాకినప్పుడు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర నష్టాల్లో కూరకుపోయాయని చెప్పారు. ఇక బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం బ్యారెల్‌కు 75 డాలర్లు పలుకుతోంది.
Read More :
Zomato | పెట్రోల్ దొరకలేదు.. గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో బాయ్.. VIDEO
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

