చెన్నై: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు అంశంలో కేంద్రం, తమిళనాడు రాష్ట్రం మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్ఈపీ అమలు చేయకుండా తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును డీఎంకే నాశనం చేస్తున్నదని ఇవాళ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఆరోపించారు. లోక్సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని తమిళనాడు సీఎం స్టాలిన్(CM MK Stalin) తప్పుపట్టారు. ఎన్ఈపీ 2020ని అమలు చేయబోమని స్టాలిన్ స్పష్టం చేశారు. ఆ విద్యా విధానాన్ని అమలు చేయాలని ఎవరూ తమను వత్తిడి చేయలేరన్నారు. విద్యార్థులకు చెందిన నిధుల్ని విడుదల చేస్తారా లేదా అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఆయనకు ఆయనే రాజులా ఫీలవుతున్నారని, చాలా దరుసుగా మాట్లాడుతున్నారని, క్రమశిక్షణ అవసరమని స్టాలిన్ తెలిపారు. తమిళనాడుకు రావాల్సిన నిధుల్ని మంజూరీ చేయకుండా, తమిళనాడు ఎంపీల పట్ల దురుసగా ప్రవర్తించారన్నారు. గతమిళనాడు ప్రజల్ని మంత్రి అవమానిస్తున్నారని చెప్పారు. మంత్రి ప్రదాన్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ప్రధాన్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు. నిధులు ఇవ్వకుండా తమిళ ప్రజల్ని మోసం చేస్తున్నారని, తమిళ ఎంపీలను అనాగరికులు అంటారా అని తన సోషల్ మీడియా పోస్టులో స్టాలిన్ ఎదురుదాడి చేశారు.
தன்னை மன்னரென எண்ணிக் கொண்டு ஆணவத்துடன் பேசும் ஒன்றியக் கல்வி அமைச்சர் @dpradhanbjp அவர்களுக்கு நாவடக்கம் வேண்டும்!
தமிழ்நாட்டின் நிதியைத் தராமல் ஏமாற்றும் நீங்கள் தமிழ்நாட்டு எம்.பி.க்களைப் பார்த்து அநாகரிகமானவர்கள் என்பதா?
தமிழ்நாட்டு மக்களை அவமானப்படுத்துகிறீர்கள்.… pic.twitter.com/wKQ7FhX3rj
— M.K.Stalin (@mkstalin) March 10, 2025