Kolkata Incident : ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటన అత్యంత హేయమని కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి అన్నారు. బెంగాల్లో జరిగిన ఘటన బాధాకరం, ఈ ఘటనకు సంబంధించి స్వయంగా మహిళ అయిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తక్షణమే నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
ఇందుకు విరుద్ధంగా ఈ ఘటనను మభ్యపెట్టి నిందితులను కాపాడేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నదని అన్నారు. ఇటీవల మమతా బెనర్జీ ప్రధానికి రాసిన లేఖలో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించేలా కఠిన చర్యలు చేపట్టాలని కోరారని మంత్రి గుర్తుచేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మహిళా హెల్ప్‌లైన్ బెంగాల్లో అమలు కావడం లేదని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళా హెల్ప్‌లైన్ పనిచేస్తే ఏ మహిళ ఇబ్బందుల్లో ఉన్నా హెల్ప్‌లైన్‌కు కాల్ చేస్తే వెంటనే 112 ఎమర్జెనీ నెంబర్‌కు ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పారు. ఆపై సమగ్రమైన పద్ధతిలో అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టే వెసులుబాటు ఉంటుందని అన్నారు. ఈ హెల్ప్‌లైన్ ఆపదలో ఉన్న ఎందరో మహిళలకు ఉపయోగపడిందని కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి వివరించారు.
Read More :
Harish Rao | ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు