న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ హౌరాలోని దొమ్జూర్ నియోజకవర్గంలో పర్యటించిన అమిత్ షా.. అక్కడి బీజేపీ అభ్యర్థి రజీబ్ బెనర్జీకే ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గంలో తాను ఒకే ఒక గ్రామ పంచాయతీలో పర్యటించానని, అక్కడి ప్రజల ఉత్సాహం చూస్తుంటే రజీబ్ బెనర్జీకి భారీ మెజారిటీ ఖాయమనిపిస్తున్నదని చెప్పారు.
వచ్చే నెల 2న బెంగాల్లో బీజేపీ 200కుపైగా సీట్లను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. మమతాబెనర్జి ప్రసంగాలు, ప్రవర్తనలో ఓటమి తాలూకూ ఫ్రస్టేషన్ కనిపిస్తున్నదని ఆయన ఎద్దేవా చేశారు. అంతకుముందు అమిత్ షా నియోజకవర్గంలోని ఒక రిక్షా కార్మికుడి ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు ఆ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రజీబ్ బెనర్జి కూడా ఉన్నారు.
Domjur: Union Home Minister and BJP leader Amit Shah has lunch at the residence of a rickshaw puller who is also a BJP supporter. Rajib Banerjee, party's candidate from the constituency also present. #WestBengal pic.twitter.com/het96CYWnz
— ANI (@ANI) April 7, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాతో బ్లడ్ క్లాటింగ్.. 30 మందిలో ఏడుగురు మృతి
సర్పంచ్ అభ్యర్థిగా 81 ఏండ్ల వృద్ధురాలు పోటీ..!
బీజేపీ సీఆర్పీఎఫ్ను నేను గౌరవించను: మమతాబెనర్జి
భూమి వైపు దూసుకొస్తున్న మరో ఉల్క
నేడు ప్రధాని ‘పరీక్షా పే చర్చ’
ఏనుగు పిల్లను భుజాలపై మోసుకెళ్లిన ఫారెస్ట్ గార్డ్.. వీడియో వైరల్