లండన్: ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నవారిలో 30 మందికి రక్తం గడ్డకట్టిన విషయం తెలిసిందే. అయితే వారిలో ఏడు మంది మరణించినట్లు బ్రిటన్‌కు చెందిన హెల్త్ రెగ్యులేటరీ ఏజెన్సీ పేర్కొన్నది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్న వారిలో బ్లడ్ క్లాటింగ్ అవుతున్నట్లు నివేదికలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యురోపియన్ యూనియన్ దేశాలు కొన్ని ఇప్పటికే ఆ టీకాపై ఆంక్షలు విధించాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 18 మిలియన్ల డోసులను ఇచ్చారు. దాంట్లో మార్చి 24వ తేదీ వరకు 30 బ్లడ్ క్లాటింగ్ కేసులు నమోదు అయ్యాయి. వారిలో ఏడు మంది మరణించినట్లు రెగ్యులేటరీ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో బ్లడ్ క్లాటింగ్ లేదని యూకే రెగ్యులేటరీ చెప్పింది.