Special Status : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న క్రమంలో బిహార్‌కు ప్రత్యేక హోదా అంశం చాలా కాలంగా నలుగుతోంది. వెనుకబడిన రాష్ట్రంలో పేదలు అత్యధికంగా ఉన్నారని, బీసీల జనాభా పెరిగిందని అందుకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం కేంద్రం తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే మేలు జరుగుతుందని బిహార్ ఎప్పటినుంచో కేంద్రాన్ని అభ్యర్ధిస్తోంది.
ఇక ఈ అంశంపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పట్నాలో సోమవారం విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. బిహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నాయని, దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇక తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీయే నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలిచే క్రమంలో బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా వంటి తూర్పు రాష్ట్రాలను దేశానికి వృద్ధి కేంద్రాలుగా మార్చాలని కేంద్రం యోచిస్తోందని చెప్పారు. 2005కు ముందు ఆటవిక పాలనతో బిహార్ వృద్ధి దారుణంగా దెబ్బతిన్నదని నిర్మలా సీతారామన్ అన్నారు.
Read More :