Union Budget 2025-26 | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శనివారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభంకాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి (Union Budget 2025-26) గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
అయితే, బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో లోక్‌సభలో విపక్షాలు నిరసనకు దిగాయి. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై చర్చించాలని సమాజ్‌వాదీ పార్టీ సహా పలు పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ్యులు సంయమనం పాటించాలంటూ స్పీకర్ ఓం బిర్లా వారికి సూచించారు. ప్రస్తుతం నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది.
Also Read..
Budget 2025 | బడ్జెట్ వేళ.. నిర్మలమ్మకు మిఠాయి తినిపించిన రాష్ట్రపతి
Maha Kumbh Mela | భక్తజనసంద్రమైన త్రివేణీ సంగమం.. 50 లక్షల మంది పుణ్యస్నానాలు
Union Budget | బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం.. రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్