న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: జమిలి ఎన్నికలపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం.. భారత ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతం చేయటంలో, ప్రాతినిథ్యాన్ని పెంచటంలో కీలకమైన ముందడుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ‘దేశంలో ఏకకాల ఎన్నికలకు సంబంధించి అత్యున్నత స్థాయి కమిటీ సిఫారసులకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. వివిధ వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపి నివేదికను అందజేసిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్గారికి అభినందనలు తెలుపుతున్నా’ అంటూ ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు.