న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: భారతీయ రైల్వేకు 2025-26 కేంద్ర వార్షిక బడ్జెట్లో రూ. 2.52 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది. 17,500 సాధారణ బోగీలు, 200 వందే భారత్, 100 అమృత్ భారత్ రైళ్ల తయారీకి కేంద్రం ఆమోదం తెలిపింది. రూ. 4.6 లక్ష కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులను బడ్జెట్లో చేర్చామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం రైల్ భవన్ వద్ద విలేకరులకు తెలిపారు.