Union Budget 2024 | 18వ లోక్‌సభ (Lok Sabha) కొలువుదీరిన విషయం తెలిసిందే. జూన్ 24వ తేదీన 18వ లోక్‌సభ మొదటి సెషన్ ప్రారంభం కాగా.. జూన్ 26న ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇక తొలి సమావేశాలు ముగియడంతో ఇప్పుడు కేంద్రం బడ్జెట్ సమావేశాలకు (Union Budget 2024) ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) శనివారం ప్రకటించారు. ఆగస్టు 12 వరకూ ఈ సమావేశాలు జరగనున్నట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను జులై 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సభలో ప్రవేశ పెట్టనున్నారు.
Hon’ble President of India, on the recommendation of Government of India, has approved the proposal for summoning of both the Houses of Parliament for the Budget Session, 2024 from 22nd July, 2024 to 12 August, 2024 (Subject to exigencies of Parliamentary Business). Union Budget,…
— Kiren Rijiju (@KirenRijiju) July 6, 2024
నిర్మలమ్మ సరికొత్త రికార్డు..
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్ నెలకొల్పనున్నారు. వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిగా ఎన్నికైన ఆమె.. 2024-25 బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అయితే, వరుసగా ఆరుసార్లు బడ్జెట్లను సమర్పించిన మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌ని అధిగమించనున్నారు. మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడితే.. వరుసగా ఏడు కేంద్ర బడ్జెట్లను సమర్పించిన ఆర్థిక మంత్రిగా ఆమె సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నారు.
కాగా, మోదీ తొలి విడుత మంత్రి వర్గంలో (2014) పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో రెండోసారి ప్రధాని మోదీ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకున్న నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖను అప్పగించారు నరేంద్రమోదీ. నాటి నుంచి దేశీయ ఆర్థిక రంగంలో మలి విడుత ఆర్థిక సంస్కరణలను పరుగులెత్తించారు. కేంద్ర మంత్రివర్గంలో మూడోసారి వరుసగా చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు.
Also Read..
Bhole Baba | హథ్రస్ తొక్కిసలాటలో కీలక పరిణామం.. భోలే బాబాపై తొలి కేసు
Mukul Roy | బాత్రూమ్లో జారిపడ్డ టీఎంసీ నేత ఆరోగ్యం విషమం : వైద్యులు
HIV infection | త్రిపుర విద్యాసంస్థల్లో హెచ్ఐవీ కలకలం.. 47 మంది విద్యార్థులు మృతి