Bhole Baba | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హథ్రస్(Hathras) తొక్కిసలాట (stampede) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్సంగ్ నిర్వహించి వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన భోలే బాబా (Bhole Baba)పై తాజాగా తొలి కేసు (First case) నమోదైంది. పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు (Patna court)లో కేసు నమోదైనట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.
కాగా, ఈనెల 2న హథ్రస్లో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అలీగఢ్‌తోపాటు హథ్రస్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో భోలే బాబా ఆధ్మాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ సత్సంగ్‌కు వేల సంఖ్యలో హాజరవుతుంటారు. ఈ నేపథ్యంలో జూలై 2న నిర్వహించిన సత్సంగ్‌కు 80 వేల మందికి ఏర్పాట్లు చేయగా.. ఏకంగా రెండున్నర లక్షల మంది హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుని 121 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఘటనతో చాలా వేదనకు గురయ్యాం.. భోలే బాబా
ఘటన తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయిన భోలే బాబా (Bhole Baba) ఇవాళ ఉదయం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తొక్కిసలాట తర్వాత పరారీలో ఉన్న అతను ఈ ఘటన తనను తీవ్రంగా బాధపెట్టిందని చెప్పాడు. జులై 2న జరిగిన ఘటనతో చాలా వేదనకు గురైనట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధను భరించే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులకు సూచించారు. ఘటనకు కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం తనకు ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి అండగా ఉండాలని కమిటీ సభ్యులను అభ్యర్థించినట్లు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
పోలీసుల ఎదుట లొంగిపోయిన ప్రధాన నిందితుడు
తొక్కిసలాటకు (Hathras stampede) కారణమైన ప్రధాన నిందితుడు దేవ్‌ప్రకాశ్ మధుకర్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. ఈ నెల 2న హత్రాస్ సత్సంగ్ కార్యక్రమానికి దేవ్‌ప్రకాశ్ ఆర్గనైజర్‌గా ఉన్నాడు. తొక్కిసలాట ఘటన తర్వాత అతడు పరారయ్యాడు. అప్పటినుంచి తప్పించుకుతిరుగుతున్న ఆయన తాజాగా ఢిల్లీలో పోలీసుల ముందు లొంగిపోయారు. అనంతరం అతడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారని దేవ్‌ప్రకాశ్ తరపు న్యాయవాది ఏపీ సింగ్(AP Singh) తెలిపారు.
అసలేం జరిగిదంటే..
జూలై 2న భోలే బాబా (Bhole Baba) అనే పేరుతో ప్రాచూర్యం పొందిన ఓ ఆధ్యాత్మికవేత్త హత్రాస్ జిల్లాలోని ఫూల్రాయ్ గ్రామంలో ‘సత్సంగ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు, అనుచరులు హాజరయ్యారు. వారిని ఉద్దేవించి భోలే బాబా తన ప్రవచనాన్ని ఇచ్చారు. కార్యక్రమం పూర్తవుతుండగా ఒక్కసారిగా పెనుగులాట చోటుచేసుకుంది. భోలే బాబా పాదాలను తాకాలని భక్తులు పరుగెత్తారు.
దీంతో అనేక మంది కింద పడిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కింద పడ్డ వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఊపిరి అందక ఆర్తనాదాలు చేస్తూ చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 121 మంది మరణించారు. తొక్కిసలాటపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ న్యాయ విచారణకు ఆదేశించారు. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారు సాక్ష్యాలను దాచిపెట్టారని, నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ ప్రమాదానికి కారణమైన భోలే బాబా పరారీలో ఉన్న విషయం తెలిసిందే.
Also Read..
Mukul Roy | బాత్రూమ్లో జారిపడ్డ టీఎంసీ నేత ఆరోగ్యం విషమం : వైద్యులు
HIV infection | త్రిపుర విద్యాసంస్థల్లో హెచ్ఐవీ కలకలం.. 47 మంది విద్యార్థులు మృతి
Akshata Murty | రిషి సునాక్ ఫేర్వెల్ స్పీచ్.. అక్షతా మూర్తి డ్రెస్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్