Akshata Murty | బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో (UK Elections) భారత సంతతికి చెందిన రిషి సునాక్ (Rishi Sunak) సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ (Labour Party) ఘన విజయం సాధించింది. 650 మంది సభ్యులు ఉండే హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేబర్ పార్టీ 412 స్థానాలను కైవసం చేసుకుంది. కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో రిషి సునాక్ ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద చివరి ప్రసంగం చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఆ సమయంలో రిషి సునాక్ వెనకే నిల్చొని ఉన్న ఆయన భార్య అక్షతా మూర్తి (Akshata Murty) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సునాక్ ఫేర్వెల్ ప్రసంగం సమయంలో అక్షత ధరించిన డ్రెస్ ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. యూకే జెండాను పోలిన ఎరుపు, తెలుపు, నీలం రంగు చెవ్రాన్ గౌనును అక్షత ధరించింది. దీన్ని ఒమి నానా అనే డిజైనర్ రూపొందించారు. దీని ధర 395 పౌండ్లుగా తెలుస్తోంది. అంటే మన భారత కరెన్సీలో రూ. 42 వేలకుపై మాటే.
ఈ డ్రెస్ గురించి నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొందరు ఈ డ్రెస్ బాగుంది, సందర్భానికి అనుగుణంగా అక్షత డ్రెస్ ధరించారని, ఈ డ్రెస్‌లో అక్షత చాలా స్టైలిష్‌గా ఉంది అంటూ చెప్పుకుంటున్నారు. అదే సమయంలో కొందరు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు (Akshata Murty trolled). ‘సునాక్ ప్రసంగం నుంచి దృష్టి మరల్చడానికే ఈ ప్రయత్నం’ అంటూ మాట్లాడుకుంటున్నారు. కొందరైతే ఆమె జీబ్రా వేషంలో ఉన్నట్లు అనిపించింది అంటూ చమత్కరిస్తున్నారు. ఆమె డ్రెస్ QR కోడ్లా ఉంది అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. రిషి సునాక్ ఫేర్వెల్ స్పీచ్ ఇస్తుండగా వెనకాల చేతిలో గొడుగుతో నిలబడ్డారు అక్షతా మూర్తి. ఆ గొడుగు గురించి కూడా నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అక్షత మూర్తి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో రిషి సునాక్ అంతకుముందు ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద చివరి ప్రసంగం చేసి, కింగ్ చార్లెస్‌ను కలిసి తన రాజీనామా పత్రం సమర్పించారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నానని, కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్టు పేర్కొన్నారు. రిషి సునాక్ ఉత్తర ఇంగ్లండ్‌లోని ఓన్ రిచ్బండ్ అండ్ నార్త్ అల్లర్టన్ స్థానం నుంచి 23 వేల ఓట్లతో గెలిచారు.
రిషి సునాక్ భావోద్వేగం
ప్రధానిగా చివరి ప్రసంగం సందర్భంగా రిషి సునాక్ భావోద్వేగానికి గురయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఆయన క్షమాపణలు చెప్పారు. ‘ముందుగా మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా. ప్రధానిగా నా బాధ్యతను పూర్తిస్థాయిలో ఏ లోటు లేకుండా నిర్వర్తించానని అనుకొంటున్నా. కానీ, యూకేలో ప్రభుత్వం కచ్చితంగా మారాల్సిందేనని మీరు(ప్రజలు) సంకేతం ఇచ్చారు. మీ ఆగ్రహం, అసంతృప్తి నాకు వినిపించింది’ అంటూ రిషి సునాక్ తన భార్య అక్షతా మూర్తిని చూస్తూ భావోద్వేగ ప్రసంగం చేశారు. ప్రధానిగా తన హయాంలో దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించానని, యూకేను ఒక సురక్షితమైన, బలమైన దేశంగా చేశానని పేర్కొన్నారు.
Leaving aside the other election stuff and tribal allegiances; Akshata Murty’s dress is absolutely perfect for the occasion. The multi-layered symbolism is *chef’s kiss* pic.twitter.com/mlTf0ZxGu9
— Saran (@__Saran__) July 5, 2024
It’s hurting my (tired) eyes. Is it deliberate attempt to distract from Sunak’s speech?
— Mask wearing blue bean 💙 (@bluebean76) July 5, 2024
Akshata desperately trying to draw the attention away from her husband in her awful dress#GeneralElection2024 pic.twitter.com/FB48bWHoof
— Charles Mossman 🇮🇪🇪🇺 #FBPE (@charles_mossman) July 5, 2024
Obviously good riddance to her husband, but I think Akshata’s dress was pretty stylish and fun, personally.
— Dominic Dean (@DrDominicDean) July 5, 2024
When I first saw it the red part wasn’t visible and it looked like she was disguising herself as a zebra.
— Contrary Mary (@ContraryMary_74) July 5, 2024
Also Read..
Iran President | ఇరాన్ నూతన అధ్యక్షుడిగా సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్
NEET-UG 2024 | నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా