Shashi Tharoor | బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో (UK Elections) భారత సంతతికి చెందిన రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ (Labour Party) ఘన విజయం సాధించింది. 650 మంది సభ్యులు ఉండే హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేబర్ పార్టీ 412 స్థానాలను కైవసం చేసుకుంది. కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఎన్నికలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) బీజేపీపై విమర్శలు చేశారు.
మన దేశంలో ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్ల నినాదంపై తనదైన స్టైల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ 400 సీట్ల నినాదం ఫలించిందంటూ వ్యాఖ్యానించారు. అయితే, అది మన దేశంలో కాదని, వేరే దేశంలో అని పేర్కొన్నారు. ‘‘మొత్తానికి ‘బీజేపీ అబ్ కీ బార్, 400 పార్’ సాధ్యమైంది. కానీ భారత్‌లో కాదు.. వేరే దేశంలో’ అని ఎక్స్ వేదికగా బీజేపీపై సెటైర్ వేశారు.
కాగా, ‘అబ్ కీ బార్.. 400 పార్’ (ab ki baar, 400 paar)- ఇది లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి ముందు బీజేపీ హోరెత్తించిన నినాదం. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు విజయం సాధించడమే లక్ష్యంగా జోరుగా ప్రచారం చేసింది. ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధిస్తుందంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా ప్రచారంలో ఊదరగొట్టారు. అయితే, వారి అంచనాలు తలకిందులయ్యాయి. బీజేపీ సొంతంగా 240 సీట్లు మాత్రమే సాధించగలిగింది. కూటమి పార్టీలతో కలిసి 293 స్థానాలకే పరిమితమైంది. దీంతో మిత్రపక్షాల సహాయంతో కేంద్రంలో మోదీ సర్కార్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది.
Finally “ab ki baar 400 paar” happened — but in another country! pic.twitter.com/17CpIp9QRl
— Shashi Tharoor (@ShashiTharoor) July 5, 2024
Also Read..
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
Hathras stampede | హథ్రస్ తొక్కిసలాటపై తొలిసారి మీడియా ముందుకు భోలే బాబా.. ఏమన్నారంటే..?