Samantha | సమంత ‘మా ఇంటి బంగారం’ నుంచి సాలిడ్ అప్డేట్.. జనవరి 9న టీజర్ రిలీజ్‌కు రంగం సిద్ధం!
Samantha | స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా వెబ్ సిరీస్‌లపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఆమె, ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి ప్రాజెక్ట్‌లతో తన పరిధిని బాలీవుడ్, ఓటిటి వరకూ విస్తరించింది.
Samantha | స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా వెబ్ సిరీస్‌లపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఆమె, ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి ప్రాజెక్ట్‌లతో తన పరిధిని బాలీవుడ్, ఓటిటి వరకూ విస్తరించింది. ఇదే సమయంలో తన వ్యక్తిగత జీవితంలోనూ కొత్త చాప్టర్ ప్రారంభించి, ప్రొడ్యూసర్‌గా కూడా అడుగులు వేసింది. తెలుగులో ఇటీవల ‘శుభం’ సినిమాలో చిన్న క్యామియోతో ప్రేక్షకులను పలకరించిన సమంత నుంచి, పూర్తి స్థాయి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ నిరీక్షణకు తెర దించుతూ, సమంత నటిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
వాస్తవానికి ఈ సినిమాను చాలా కాలం క్రితమే ప్రారంభించారు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇటీవల దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి ఈ సినిమాను మళ్లీ పట్టాలెక్కించగా, ఇప్పుడు సమంత నుంచి అధికారికంగా సాలిడ్ అప్డేట్ వచ్చింది. తాజాగా విడుదలైన మాస్ పోస్టర్‌తో పాటు, ఈ సినిమా టీజర్ ను జనవరి 9న విడుదల చేయనున్నట్లు సమంత స్వయంగా ప్రకటించింది. ఈ పోస్టర్లో సమంత పవర్ఫుల్, ఇంటెన్స్ లుక్‌లో కనిపించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలకు భిన్నంగా, ఈ చిత్రంలో పూర్తిగా క్రైమ్ యాక్షన్ నేపథ్యంలోని పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ సినిమాకు కథను సమంత మాజీ భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడుమోరు అందించడం విశేషం. అలాగే ఈ ప్రాజెక్ట్‌ను సమంత స్వయంగా తన బ్యానర్లో నిర్మించడంతో, ‘మా ఇంటి బంగారం’ ఆమెకు ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా మారింది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కంటెంట్ పరంగా కూడా బలంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. సమంత కెరీర్లో ఇది మరో కీలకమైన మలుపుగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.మొత్తానికి, వెబ్ సిరీస్‌లతో గ్లోబల్ రీచ్ సాధించిన సమంత, ఇప్పుడు మళ్లీ తెలుగులో ఒక పవర్ఫుల్ థియేట్రికల్ ప్రాజెక్ట్‌తో రాబోతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. జనవరి 9న విడుదలయ్యే టీజర్‌తో ఈ సినిమా పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

