NEET-UG 2024 | దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024 (NEET-UG 2024) పేపర్ లీక్ (Paper Leak) కావడం, గ్రేస్ మార్కుల కేటాయింపు వ్యవహారం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాదం వేళ నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. తదుపరి నోటీసులు వచ్చేంత వరకూ కౌన్సెలింగ్‌ను వాయిదా (Counseling Postponed) వేస్తున్నట్లు అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి.
నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీక్ కావడం, గ్రేస్ మార్కుల కేటాయింపు వివాదం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పేపర్ లీక్ కావడంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏకపక్షంగా గ్రేస్ మార్కులు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలోనే పలువురు నీట్ యూజీ ఎగ్జామ్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం నీట్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాలని కేంద్రం, ఎన్టీయేకి నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై ఎల్లుండి అంటే జులై 8న సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి.
Also Read..
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
Hathras stampede | హథ్రస్ తొక్కిసలాటపై తొలిసారి మీడియా ముందుకు భోలే బాబా.. ఏమన్నారంటే..?