Maharashtra Elections | కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇటీవలే జరిగిన హర్యానా ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ పడిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Elections)నూ హస్తం పార్టీకి అదే పరిస్థితి ఎదురైంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల వ్యూహం బెడిసికొట్టింది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ మరఠ్వాడాలో బీజేపీ గెలుపు దిశగా ముందంజలో కొనసాగుతోంది. ఆధిక్యాల్లో మహాయుతి కూటమి (Mahayuti) మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. ఎర్లీ ట్రెండ్ ప్రకారం.. 223 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ (Maha Vikas Aghadi) కూటమి కేవలం 55 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 స్థానాలు గెలుపొందాల్సి ఉంటుంది. తాజా ఫలితాలు.. మహారాష్ట్ర ఎన్నికల్లో పాగా వేయాలనుకొన్న హస్తం నేతలకు పెద్ద షాక్ తగిలినట్లైంది. కర్ణాటక, తెలంగాణలో పాలనా వైఫల్యాలు మహా ఫలితాలపై గట్టి ప్రభావం చూపాయి. ఇక్కడ మహాయుతి కూటమి గెలుపు దాదాపు ఖరారైంది.
Also Read..
Revanth Reddy | గ్యారెంటీలకు పడిపోని ‘మరాఠీలు’.. రేవంత్ రెడ్డికి చెంపపెట్టు సమాధానం..
Jharkhand | బీజేపీ ఆశలు గల్లంతు.. జార్ఖండ్ పీఠం హేమంత్‌దే
Oreshnik Missile: ఓరష్నిక్ మిస్సైల్ ప్రయోగించిన రష్యా.. ఆ కొత్త క్షిపణి ప్రత్యేకతలు ఇవే