ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్ప కూలింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలో ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్లైఓవర్‌లోని ఓ భాగం శుక్రవారం తెల్లవారుజామున 4.40 గంటల సమయంలో కుప్ప కూలింది. దీంతో 14 మంది కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తలరించారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే అనుమానంతో సహాయక చర్యలు చేపట్టారు.
#WATCH | Nine people sustained minor injuries & were taken to a nearby hospital after a portion of an under-construction flyover collapsed in Mumbai's Bandra Kurla Complex at around 4:40 am today, as per a fire brigade official present at the spot
— ANI (@ANI) September 17, 2021
(Latest visuals from the spot) pic.twitter.com/Ddrzw0uzT5