న్యూఢిల్లీ : ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 (G20 Summit) సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు దేశాధినేతలు ఇప్పటికే హస్తిన చేరుకోగా, వీఐపీలు, ప్రముఖులు సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ బాటపట్టారు. 18వ జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు.
సెప్టెంబర్ 9-10న భారత్ మండపంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీలో అడుగుపెట్టిన గుటెరస్‌కు నృత్య కళాకారిణులు జానపద నృత్యం చేస్తుండగా ఘన స్వాగతం లభించింది. సదస్సు ముగిసే క్రమంలో జీ20 ఢిల్లీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. ఐక్యరాజ్యసమితి వ్యవస్ధాపక సభ్యదేశంగా భారత్ ఐక్యరాజ్యసమితి సిద్ధాంతాలు, ఆశయాల అమలుకు మద్దతుగా నిలుస్తుందని అంతకుముందు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
అంతర్జాతీయ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి అమలు చేస్తున్న అంతర్జాతీయ సంబంధాల నిబంధనలు సమర్ధంగా పనిచేస్తాయని భారత్ గట్టిగా విశ్వసిస్తోందని తెలిపింది. ఆగస్ట్‌లో బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల అవసరాన్నినొక్కిచెప్పారు. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలకు బ్రిక్స్ సంయుక్త ప్రకటన కూడా పిలుపు ఇచ్చింది. ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి ఎదుగుతున్న, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు బ్రిక్స్ మద్దతు తెలిపింది.
Read More :
G20 Meeting: మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవగౌడకు ఆహ్వానం.. మల్లిఖార్జున్ ఖర్గేకు అందని ఆహ్వానం