UGC NET Exam : నీట్ రగడ కొనసాగుతున్న నేపధ్యంలోనే అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం కలకలం రేపింది. యూజీసీ నెట్ పరీక్ష రద్దు ఉన్నత విద్యా శాఖలో కేంద్ర ప్రభుత్వ అసమర్ధతను వెల్లడిస్తోందని కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు ఆరోపించారు.
ఈ పరీక్ష రాసిన విద్యార్ధుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం అడిగి తెలుసుకోవాలని ఆమె కోరారు. యూజీసీ నెట్ పరీక్షలో కొందరు అక్రమాలు జరిగాయనే అంశాలను లేవనెత్తారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టారని అదే సమయంలో విద్యార్ధులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆమె కోరారు.
మరోవైపు నీట్ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ సర్కార్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నాపత్రాల లీకులను ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు.
విద్యా వ్యవస్ధను బీజేపీ మాతృసంస్ధ గుప్పిట్లో బంధించడంతో పేపర్ లీక్‌లు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లీకులను ఆపాలంటే విద్యా వ్యవస్ధను బీజేపీ మాతృసంస్ధ చెర నుంచి విడిపించాలని పేర్కొన్నారు. నీట్ పరీక్షను రద్దు చేసి విద్యార్ధులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More :