Telangana | ఇన్‌స్టా రీల్స్ పిచ్చి.. ఉరి బిగుసుకుని యువకుడు మృతి
Telangana | ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సరదాగా ఉరి వేసుకుని వీడియో చేయబోయే నిజంగానే ఉచ్చు బిగుసుకోవడంతో యువకుడు మృతిచెందాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈ విషాదం చోటుచేసుకుంది.
Telangana | ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సరదాగా ఉరి వేసుకుని వీడియో చేయబోయే నిజంగానే ఉచ్చు బిగుసుకోవడంతో యువకుడు మృతిచెందాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈ విషాదం చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కందకట్ల అజయ్ (23) స్థానికంగా ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. అతనికి మొబైల్లో రీల్స్ చేయడం అంటే పిచ్చి. ఈ క్రమంలోనే మంగళవారం హోటల్లో పని పూర్తి చేసుకున్న తర్వాత తన చిన్నక్క ఇంటికి వెళ్లాడు. రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఉరివేసుకున్నట్లుగా రీల్ చేయాలని అనుకున్నాడు. ఇంట్లోని ఫ్రిజ్‌పై సెల్‌ఫోన్‌ను సెట్ చేసుకుని.. దూలానికి ఉరితాడు వేశాడు. అనంతరం వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ఉచ్చు బిగుసుకుని నిజంగా ఉరిపడింది.
ఉరి బిగుసుకోవడంతో ఊపిరాడక అజయ్ మరణించాడు. బుధవారం ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులు అజయ్ ఉరివేసుకుని కనబడటం చూసి షాకయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అజయ్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని అజయ్ తల్లి దేవమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

