Maharashtra Bandh : మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ స్కూల్లో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనకు వ్యతిరేకంగా ఎంవీఏ మహారాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చింది. స్కూళ్లలో బాలికలకు రక్షణ లేదని ప్రజలు భావిస్తున్నారని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. శనివారం జరిగే బంద్‌లో కేవలం మహావికాస్ అఘది (ఎంవీఏ)యే కాకుండా అన్ని వర్గాల ప్రజలు, పౌరులందరూ పాలుపంచుకోవాలని ఠాక్రే పిలుపు ఇచ్చారు.
బంద్ మధ్యాహ్నం రెండు గంటల వరకూ కొనసాగుతుందని చెప్పారు. రేపటి బంద్ సందర్భంగా బస్సులు, రైళ్లనూ ఎక్కడికక్కడ నిలిపివేయాలని ఆయన కోరారు. మీరు ఏ మతం, కులం వారైనా కావచ్చు మీ కూతుళ్లు, అక్కాచెల్లెళ్లను కాపాడుకునేందుకు బంద్‌ను విజయవంతం చేయాలని ఠాక్రే పిలుపు ఇచ్చారు. కాగా, మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ స్కూల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది
. ఈ ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరుగుతోందని టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర మహారాష్ట్ర సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుడిని కొద్దిగంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారని, కానీ బద్లాపూర్ ఘటనలో రోజులు గడిచినా ఇంతవరకూ కేసు నమోదు చేయలేదని ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు.
Read More :
Megha Akash | ఆరేండ్ల ప్రేమ.. ప్రియుడితో మేఘా ఆకాశ్ ఎంగేజ్మెంట్