ముంబై, జూన్ 19 : తన నాయకత్వంపై నమ్మకం లేకపోతే పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తానని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. కొంతమంది ఎంపీలు పార్టీ ఫిరాయించి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు రెడీ అవుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. పార్టీ ఆవిర్భావం రోజున ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
‘పార్టీ అధ్యక్ష పదవిలో నేను కొనసాగడం ఇష్టం లేకపోతే ఆ స్థానం ఎవరికి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నా. పార్టీ సిద్ధాంతాల విషయంలో ఎలాంటి రాజీ పడబోను. పార్టీ పడిపోతున్నదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది జరుగని పని. మేం మా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం’ అని ఉద్ధవ్ ఠాక్రే చెప్పుకొచ్చారు.