UCC | బహుళత్వానికి యూసీసీతో ముప్పు: స్టాలిన్
చెన్నై: ఉమ్మడి పౌరస్మృతిని (యూసీసీ) అమలుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది దేశ బహుళ సాంస్కృతిక నిర్మాణానికి పెనుముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
చెన్నై: ఉమ్మడి పౌరస్మృతిని (యూసీసీ) అమలుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది దేశ బహుళ సాంస్కృతిక నిర్మాణానికి పెనుముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ లౌకిక దేశమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 మైనార్టీల హక్కులకు రక్షణ కల్పిస్తున్నదని చెప్పారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, ఉనికిపై యూసీసీ తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక అంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా యూసీసీ అమలుకు యత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మతాల మధ్య విభజనకు, సామాజిక అలజడులకు ఇది కారణమవుతుందని చెప్పారు. వివిధ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులు వేర్వేరుగా ఉంటాయని, అందరినీ ఒకేగాటిన కడుతూ యూసీసీ అమలుచేయడం సరికాదన్నారు. ఈ మేరకు లా కమిషన్ చైర్పర్సన్కు ఆయన గురువారం లేఖ రాశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Law Commission
- Stalin
- tamilnadu
- UCC
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

