శనివారం 28 నవంబర్ 2020
National - Nov 17, 2020 , 09:22:11

ఢిల్లీలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌

ఢిల్లీలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను సోమవారం రాత్రి అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ తెలిపింది. అరెస్టు సమయంలో వారి నుంచి రెండు సెమీ ఆటోమేటిక్‌ పిస్టల్స్‌తో పాటు పది లైవ్‌ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు ఢిల్లీలో ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు సోమవారం రాత్రి మిలీనియం పార్క్‌, సారాయ్‌ కాలే ఖాన్‌ సమీపంలో వారిని వలపన్ని పట్టుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా, కుప్వారా నివాసితులైన అనుమానిత ఉగ్రవాదులను అబ్దుల్‌ లతీఫ్‌ (22), అష్రఫ్‌ ఖటన (20)గా గుర్తించారు. ఇంతకు ముందు ఆగస్ట్‌లో దేశ రాజధానిలో ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ ఐసిస్‌ ఆపరేటివ్‌ యూసుఫ్‌ ఖాన్‌ను పట్టుకుంది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.