Pakistani voters : బీహార్ ఓటర్ల జాబితా (Bihar voters list) లో అవకతవకలు జరిగాయంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో వారి విమర్శలకు మరింత ఊతం ఇచ్చే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బీహార్లో ఇద్దరు పాకిస్థానీ మహిళల (Pakistani Women) కు ఓటరు కార్డులు జారీ అయినట్టు తాజాగా బయటపడింది. ఇమ్రానా ఖానమ్ అలియాస్ ఇమ్రానా ఖాటూన్, ఫిర్దోషియా ఖానమ్ అనే ఇద్దరు పాక్ మహిళలకు ఇటీవల ఓటర్ కార్డులు జారీ అయ్యాయి.
కాగా దీనిపై కేంద్ర హోం శాఖ చర్యలకు దిగింది. ఆ ఇద్దరు మహిళల పేర్లను వెంటనే ఓటర్ లిస్టు నుంచి తొలగించాలని సంబంధిత యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై జిల్లా మెజిస్ట్రేట్ వెంటనే తక్షణ ఆదేశాలు ఇవ్వడంతో ఓటర్ల జాబితా నుంచి ఇద్దరు పాకిస్థానీ మహిళల పేర్లు తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘంపై, బీజేపీ సర్కారుపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఇది మరో అస్త్రం అయ్యింది.