న్యూఢిల్లీ: భారత నావికాదళ అమ్ములపొదిలోకి రెండు కొత్త నీలగిరి తరగతి యుద్ధ నౌకలు చేరాయి. ప్రాజెక్టు 17 ఆల్ఫాలో భాగంగా దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధనౌకలు విశాఖ వేదికగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంగళవారం జలప్రవేశం చేశాయి.
హిమగిరి, ఉదయగిరి రెండూ ఎక్కువ భాగం దేశీయ పరికరాలతో రూపుదిద్దుకున్నాయి. అద్భుతమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు వీటి సొంతం.