Deportation | అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత (Deportation) కొనసాగుతోంది. యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న పలు దేశాల వారిని ట్రంప్ సర్కార్ ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటి బ్యాచ్ కింద 104 మంది భారతీయులతో ఓ విమానం ఇప్పటికే భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. టెక్సాస్ (Texas) నుంచి బయల్దేరిన అమెరికా మిలటరీకి చెందిన సీ-17 విమానం (US C 17 Military Plane) ఫిబ్రవరి 5న అమృత్సర్ (Amritsar) విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. తాజాగా మరో రెండు విమానాలు రానున్నట్లు తెలిసింది.
119 మంది భారతీయులతో మొదటి విమానం ఈనెల 15న రాత్రి 10:05 గంటలకు అమృత్‌సర్‌లో ల్యాండ్ కానున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 16 రాత్రికి మరో విమానం కూడా రానున్నట్లు సమాచారం. మొదటి విమానంలో పంజాబ్‌కు చెందిన 67 మంది, హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన 19 మంది ఉన్నట్లు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. వీళ్లంతా డంకీ రూట్, ఇతర మార్గాల్లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులుగా ఆ దేశం పేర్కొంటున్నది.
కాగా, ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అక్రమ వలసదారుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు.
Also Read..
Mumbai terror attacks | ముంబై ఉగ్రదాడుల నిందితుడి అప్పగింతకు ట్రంప్ అంగీకారం
Donald Trump | ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. యూ ఆర్ గ్రేట్’.. మోదీకి ట్రంప్ స్పెషల్ గిఫ్ట్
Donald Trump | ట్రంప్‌తో మోదీ భేటీ.. మిమ్మల్ని చాలా మిస్సయ్యానన్న అమెరికా అధ్యక్షుడు