వాషింగ్టన్: రెండు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో (Donald Trump) ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీని ఆప్యాయంగా కౌగిలించుకున్న ట్రంప్.. మిమ్మల్ని నేను చాలా మిస్సయ్యాను మిత్రమా అంటూ మోదీని ఉద్దేశించి అన్నారు. ప్రతిగా తనకు కూడా మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉందని మోదీ బదులిచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు (భారత కాలమానం ప్రకారం) వైట్ హౌస్‌లోని వెస్ట్వింగ్ లాబీలో ఈ సమావేశం జరిగింది.
#WATCH | Washington, DC | PM Narendra Modi and President Donald Trump share a hug as the US President welcomes the PM at the White House
President Trump says, “We missed you, we missed you a lot.” pic.twitter.com/XTk1h7mINM
— ANI (@ANI) February 13, 2025
మోదీకి ఘనంగా స్వాగతం పలికిన ట్రంప్.. కరచాలనం చేశారు. అనతరం ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ సమయంలో ‘మిత్రమా నేను మిమ్మల్ని చాలా మిస్సయ్యా’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించింది. మోదీ సైతం ట్రంప్‌ను ఆప్యాయంగా పలకరించారు. దీనికి సంబంధించిన వీడియోను వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అంతకుముందు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, యూఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) తులసి గబ్బార్డ్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మస్క్ పిల్లలకు మోదీ కొన్ని బహుమతలు అందజేశారు.