ఇండోర్: కరోనా మహమ్మారి దేశమంతటా కరాళ నృత్యం చేస్తున్నది. లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దాంతో ఏమాత్రం అస్వస్థతగా ఉన్నా తమకూ వైరస్ సోకిందేమోనన్న భయంతో జనం కొవిడ్ పరీక్షా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఈ కారణంగా కొవిడ్ నిర్ధారణా కేంద్రాల్లో జనం తాకిడిని నియంత్రించడం వైద్య సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతున్నది.
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ పరీక్షా కేంద్రాలపై జనం ఒత్తిడి తగ్గించడం కోసం, కొవిడ్ కేంద్రాలకు వెళ్లి గంటల కొద్ది సమయం వెచ్చించలేకపోతున్న వారి కోసం రద్దీ మార్గాల్లో డ్రైవ్ ఇన్ కొవిడ్ టెస్టింగ్ సౌకర్యాలను కల్పించింది. అందుకోసం నెహ్రూ స్టేడియంలో, దసరా మైదాన్‌లో రెండు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది.
Madhya Pradesh: Two drive-in COVID19 testing facilities have been started at Nehru Stadium and Dussehra Maidan in Indore.
— ANI (@ANI) April 28, 2021
Visuals from Nehru Stadium. (27/4) pic.twitter.com/0sdnryjt6t
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
తెలంగాణలో కొత్తగా 8,061 కరోనా కేసులు
ఒక్కరోజే 17.23 లక్షలకుపైగా కరోనా పరీక్షలు: ICMR
అసోంలో భూకంపం.. ఇంటిపై ఒరిగిన మరో బిల్డింగ్.. వీడియో
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో