Road Accident | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లోని పూంచ్ (Poonch) జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన లోయలోకి పడిపోయింది (Bus Plunges Into Gorge). ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
ఈ ఘటన మెంధార్ (Mendhar)లోని ఘని ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది. ఉదయం 9:20 గంటల ప్రాంతంలో బస్సు ఘని (Ghani) గ్రామం నుంచి మెంధార్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ వంపు వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 42 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన మెంధార్లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం రాజౌరికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
#WATCH | J&K | Two passengers dead, 25 injured in bus accident Ghani Mendher in Poonch district; Injured rescued and evacuated to sub-district hospital in Mendhar pic.twitter.com/iFYOLvxqUh
— ANI (@ANI) May 6, 2025
Also Read..
Chhattisgarh | కర్రెగుట్టలో ఎదురుకాల్పులు.. మహిళా మావోయిస్టు మృతి
Gujarat Rains | గుజరాత్లో వర్షబీభత్సం.. 14 మంది మృతి
Lathi charge | సీఎం నివాసం దగ్గర పోలీసుల లాఠీచార్జి.. పరిస్థితి ఉద్రిక్తం.. Video