Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అడవుల్లో మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టుల కోసం గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు ప్రాణాలు కోల్పోయింది.
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా కర్రెగుట్టలో (Karregutta hills) మావోయిస్టుల కోసం భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కర్రెగుట్టలో కేంద్ర బలగాలు గత 15 రోజులుగా నిర్విరామంగా కూంబింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఈ మేరకు స్పాట్లో 303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో ఏప్రిల్ 21 నుంచి జరుగుతున్న నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఇప్పటి వరకూ నలుగురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 23న కర్రెగుట్టలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మరణించారు. అప్పుడు ఘటనాస్థలి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read..
Omar Abdullah | జమ్ముకశ్మీర్ పెన్షన్ సువిధ పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం ఒమర్ అబ్దుల్లా.. Video
Gujarat Rains | గుజరాత్లో వర్షబీభత్సం.. 14 మంది మృతి
Rahul Gandhi | లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన రాహుల్ గాంధీ