Omar Abdullah : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని మాజీ ఉద్యోగులు (Ex Employees), మాజీ చట్టసభ్యులు (Ex-legislators) పెన్షన్ పొందడాన్ని సులభతరం చేసే చర్యలో భాగంగా సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ‘జమ్ముకశ్మీర్ పెన్షన్ సువిధ (J&K Pension Suvidha)’ పోర్టల్‌ను ప్రారంభించారు. శ్రీనగర్‌లోని సివిల్ సెక్రెటేరియట్‌లో ఈ పోర్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ కోసం దశాబ్దాలుగా సేవలందించిన మాజీ ఉద్యోగులు, చట్టసభల మాజీ సభ్యులు సులభతరమైన పెన్షన్ ప్రక్రియను వినియోగించుకునేందుకు అన్ని విధాలుగా యోగ్యతను కలిగి ఉన్నారని అన్నారు. అందుకోసమే ఇప్పుడు జమ్ముకశ్మీర్ పెన్షన్ సువిధ పోర్టల్‌ను ప్రారంభించానని చెప్పారు. దాంతో వారికి పెన్షన్ సెటిల్మెంట్లు చేసుకోవడం సులువు అవుతుందని తెలిపారు.
#WATCH | J&K CM Omar Abdullah launched J&K Pension Suvidha Portal, at the civil secretariat in Srinagar.
CM tweeted, “Employees and ex-legislators who have served J&K and its people for decades deserve a simplified process for handling their pension papers. Today, I launched the… pic.twitter.com/B9zoEEgpR5
— ANI (@ANI) May 6, 2025