Rahul Gandhi | గత నెల 22న జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam terror attack)లో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (Lt Vinay Narwal) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పరామర్శించారు. ఇవాళ ఉదయం హర్యానాలోని కర్నాల్‌కు చేరుకున్న రాహుల్.. వినయ్ నర్వాల్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ వినయ్ నర్వాల్‌కు నివాళులర్పించారు. అనంతరం నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ (Himanshi Narwal), ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ రెండేళ్ల కిందట భారత నౌకాదళంలో చేరారు. కేరళలోని కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. అంకితభావంతో పని చేసే అధికారిగా సహచరులు, ఉన్నతాధికారుల నుంచి ఆయన మన్ననలు పొందారు. ఏప్రిల్ 16న వినయ్ నర్వాల్‌కు పెళ్లి జరిగింది. 19న రిసెప్షన్ తర్వాత హనీమూన్ కోసం ఈ జంట జమ్ముకశ్మీర్‌కు వెళ్లింది. 22న జరిగిన ఉగ్రదాడిలో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిలో ఇద్దరు విదేశీలతో సహా 26 మంది మరణించగా మరికొందరు గాయపడ్డారు.
Also Read..
Mock Drills | కేంద్ర హోంశాఖ కీలక సమావేశం.. రేపు 259 చోట్ల సెక్యూరిటీ మాక్ డ్రిల్స్
Abdul Basit | మే 10-11 తేదీల్లో పాక్‌పై భారత్ దాడులు.. పాక్ దౌత్యవేత్త సంచలన ట్వీట్
Ajit Doval | పాక్‌తో ఉద్రిక్తతల వేళ.. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ భేటీ