మహబూబ్నగర్ : జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..మహబూబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న దర్పల్లికి చెందిన శివ(9) నాలుగో తరగతి గణేష్(9) నాలుగో తరగతి చదువుతున్నారు. బోనాల పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో ఇంటి దగ్గరే ఉన్న ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న నీటి గుంతలోకి ఈత కొట్టడానికి వెళ్లి నీళ్లలో మునిగి చనిపోయారు.
కాగా, పిల్లల ఆచూకీ కోసం వెతుకగా.. గుంత పక్కనే బట్టలు ఉండడంతో అనుమానం వచ్చి వెతికారు. ఇద్దరు పిల్లల మృతదేహాలు బయటపడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ప్రమాదానికి కారణం కొంతమంది ఫిల్టర్ ఇసుక కోసం ఈ గుంతలు తీయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు చేరి ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పిల్లల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.