భోపాల్: ఇద్దరు కవల సోదరులు చాకచక్యంగా పోలీసుల కళ్లుగప్పి దొంగతనాలు చేశారు. ఒకరు దొంగతనం చేస్తూ ఉంటే, మరొకరు అదే సమయంలో వేరొక చోట ఉన్నట్టు పోలీసులను నమ్మించేలా సీసీటీవీలో రికార్డయ్యేలా ప్రవర్తించేవారు. కేసు దర్యాప్తు సమయంలో తాను దొంగతనం చేయలేదని, పలానా చోట ఉన్నానని సీసీటీవీ ఫుటేజ్‌ను చూపించేవారు.
మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సౌరభ్ వర్మ, సంజీవ్ వర్మ ఒకేలా ఉండే కవలలు. వీరిద్దరూ ఓ ఇంట్లోకి వెళ్లి, లక్షలాది రూపాయల విలువ చేసే ఆభరణాలు, ఇతర వస్తువులను దోచుకున్నారు. పోలీసులు సౌరభ్‌తోపాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. అంతలోనే సంజీవ్ తనంతట తానే పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. అన్నదమ్ములిద్దరినీ చూసిన పోలీసులు అయోమయానికి గురయ్యారు. సంజీవ్‌ను కూడా అరెస్ట్ చేసి, ప్రశ్నించారు. అన్నదమ్ములిద్దరూ తమ గుట్టును తామే బయటపెట్టారు.