Actor Vijay | ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు (TVK party chief) విజయ్ (Vijay) నేడు కరూర్ తొక్కిసలాట (Karur stampede) బాధితులను కలవనున్నారు. మహాబలిపురం (Mahabalipuram)లో బాధిత కుటుంబాలతో సమావేశం కానున్నారు. ఓ హోటల్లో జరగనున్న ఈ సమావేశానికి మీడియాతోపాటూ పార్టీ నేతలకు కూడా అనుమతి లేదని పార్టీ వర్గాల సమాచారం. బాధితులతో భేటీ కోసం టీవీకే ఆ హోటల్లో 50 గదులను బుక్ చేసినట్లు తెలిసింది. కరూర్తోపాటు ఇతర జిల్లాల్లో ఉన్న బాధిత కుటుంబాలను ప్రత్యేక బస్సుల్లో హోటల్‌కు తీసుకురానున్నట్లు టీవీకే పార్టీ వెల్లడించింది.
2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొత్త పార్టీని స్థాపించిన విజయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టారు. గత నెల 27న కరూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60 మంది గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఇక మృతుల కుటుంబాలకు టీవీకే ఆర్థిక సాయం కూడా ప్రకటించింది.
Also Read..