Suriya 46 | 11ఏళ్ల తర్వాత టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ .. ఆమె రోల్‌పై డిస్కషన్స్
Suriya 46 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్లో స్ట్రైట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు–తమిళం) ప్రస్తుతం “Suriya 46” అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది.
Suriya 46 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్లో స్ట్రైట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు–తమిళం) ప్రస్తుతం “Suriya 46” అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. చిత్రంకి సంబంధించిన ఒక్కో అప్డేట్తో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ మరో ఆసక్తికరమైన సమాచారం బయట పెట్టింది. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఆమె పుట్టినరోజు (అక్టోబర్ 26) సందర్భంగా సినిమా యూనిట్ రవీనాకు బర్త్‌డే విషెస్ చెబుతూ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. “మీరు మా ప్రయాణంలో భాగం అవ్వడం ఆనందంగా ఉంది… రాబోయే అద్భుతమైన జర్నీ కోసం ఎదురుచూస్తున్నాం” అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.‘సూర్య 46’లో ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు రవీనా టాండన్ కూడా జాయిన్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ పెరిగింది. ఆమె పాత్రపై ఇప్పుడు అందరిలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.
భావోద్వేగాలు, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో మిళితం చేసే దర్శకుడిగా వెంకీ అట్లూరి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘తొలి ప్రేమ’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్లు అందించారు. ఇప్పుడు వర్సటైల్ నటుడు సూర్యతో కలిసి చేస్తున్నందున ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. కాగా, ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన రవీనా టాండన్, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె గతంలో నందమూరి బాలకృష్ణ సరసన ‘బంగారు బుల్లోడు’, అక్కినేని నాగార్జునతో ‘ఆకాశవీధిలో’ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. తర్వాత 2014లో మోహన్ బాబుతో కలిసి ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో కనిపించారు. ఇటీవల ‘కేజీఎఫ్ 2’లో రమికా సేన్ పాత్రకి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఇప్పుడు దాదాపు పదేళ్ల విరామం తర్వాత రవీనా టాండన్ ‘సూర్య 46’ ద్వారా టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

