లక్నో: కదులుతున్న రైలు నుంచి తన భార్యను ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) తోసినట్లు నేవీ అధికారి ఆరోపించారు. రైలు నుంచి కిందపడిన ఆమె మరణించినట్లు ఫిర్యాదు చేశారు. (TTE Push Navy Officer’s Wife To Death) అయితే టికెట్ విషయంపై గొడవ వల్ల నేవీ అధికారి భార్యనే రైలు నుంచి దూకినట్లు టీటీఈ ఆరోపించాడు. రైల్వే పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవంబర్ 25న నేవీ అధికారి అజయ్ సింగ్ భార్య ఆర్తీ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నది. ఉదయం 7.30 గంటలకు పాట్నా-ఆనంద్ విహార్ ప్రత్యేక రైలులోని స్లీపర్ కోచ్‌లోకి ఎక్కింది.
కాగా, మంగళవారం ఉదయం 9:30 గంటల సమయంలో టీటీఈ సంతోష్ కుమార్ ఆ కోచ్‌లోకి వచ్చాడు. టికెట్ చూపించమని నేవీ అధికారి భార్య ఆర్తీని అడిగాడు. మరో రైలుకు సంబంధించిన ఏసీ రిజర్వేషన్ టికెట్ ఆమె వద్ద ఉన్నది. దీంతో జనరల్ బోగిలోకి మారాలని చెప్పాడు. ఈ విషయంపై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఎటావా జిల్లాలోని భర్తన స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు నుంచి తన భార్యను టీటీఈ తోసి చంపినట్లు నేవీ అధికారి అజయ్ సింగ్ ఆరోపించారు. ఈ మేరకు రైల్వే పోలసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు నేవీ అధికారి భార్యను జనరల్ కోచ్‌లోకి మారమని మాత్రమే తాను చెప్పానని టీటీఈ సంతోష్ కుమార్ తెలిపాడు. అయితే ఆధార్ కార్డు తనపై విసిరిన ఆమె తన బ్యాగ్‌ను తీసుకొని రైలు నుంచి దూకిందని ఆరోపించాడు. టీటీఈ సంతోష్ కుమార్ వాదనను మరో ఐదుగురు ప్రయాణికులు సమర్థించారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా రైల్వేకు సమాచారం ఇచ్చారు.
అయితే ఇందులో ఏదో కుట్ర ఉన్నదని నేవీ అధికారి అజయ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీటీఈ సంతోష్ కుమార్‌పై ఎటావా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
GPS spoofing | ఢిల్లీ ఎయిర్పోర్ట్ సమీపంలో జీపీఎస్ జామ్.. పార్లమెంట్లో నిర్ధారించిన ప్రభుత్వం
Woman’s Jaw Dislocates | పానీపూరీ తినేందుకు పెద్దగా నోరు తెరిచిన మహిళ.. విరిగిన దవడ
Bengal BLO’s Protest | బెంగాల్లో పోలింగ్ బూత్ స్థాయి అధికారుల నిరసన.. ‘సర్’ పని ఒత్తిడిపై ఆందోళన