కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) విధులు నిర్వహిస్తున్న పోలింగ్ బూత్ స్థాయి అధికారులు (బీఎల్వో) భారీ నిరసన చేపట్టారు. పని ఒత్తిడి, పని పరిస్థితులు, మానసిక ఆరోగ్యంపై ఆందోళన చెందారు. (Bengal BLO’s Protest) బీఎల్వో అధికార్ రక్షా కమిటీ నేతృత్వంలో సోమవారం మధ్యాహ్నం కోల్‌కతాలోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెలుపల భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ‘సర్’ విధుల వల్ల ఒత్తిడి, పని పరిస్థితులు, మానసిక ఆరోగ్య పరిస్థితుల వల్ల కొందరు బీఎల్వోలు ఆత్మహత్యలకు పాల్పడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
కాగా, సోమవారం ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో శాసనసభ్యుల బృందంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడకు చేరుకున్నారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ‘వెనక్కి వెళ్లిపోండి’ అంటూ నిరసన చేస్తున్న బీఎల్వోలు బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. నిరసన చేస్తున్న బీఎల్వోలకు ప్రతిగా నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్నది. అయినప్పటికీ బీజేపీ నేతలు ఆ కార్యాలయంలోకి వెళ్లారు. బీఎల్వోల పని పరిస్థితులకు టీఎంసీ ప్రభుత్వమే కారణమని సువేందు అధికారి ఆరోపించారు.
#WATCH | Kolkata, West Bengal: Booth Level Officers (BLOs) engaged in SIR exercise hold a protest outside the office of the Election Commission. pic.twitter.com/47xOqI35FU
— ANI (@ANI) December 1, 2025
Also Read:
SIR Deadline Extended | ‘సర్’ గడువు వారం రోజులు పొడిగింపు.. ఫిబ్రవరి 14న తుది జాబితా
Watch: కస్టమర్‌గా నటించి.. బంగారు గొలుసులు ఎత్తుకెళ్లిన వ్యక్తి